Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కామన్వెల్త్‌లో గోల్డ్ హంట్.. మరో 25 పతకాలు ఖాతాలో పడే ఛాన్స్!

కామన్వెల్త్‌లో గోల్డ్ హంట్.. మరో 25 పతకాలు ఖాతాలో పడే ఛాన్స్!

V6 Velugu 3 weeks ago

Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఈరోజు (శనివారం, ఆగస్టు 1న) భారత్ అథ్లెట్లు అసలైన పతకాల వేటకు రెడీ అయిపోయారు.

ఇప్పటి వరకు జరిగిన ఆట ఒక లెక్క.. ఇవాళ జరిగే ఫైట్ ఇంకో లెక్క. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 23 మెడల్స్ (5 గోల్డ్, 12 సిల్వర్, 6 బ్రాంజ్) ఉన్నాయి. పాయింట్స్ టేబుల్‌లో ఇండియా 10వ ప్లేస్‌లో ఉంది. కానీ ఇవాళ ఒక్కరోజే సీన్ మొత్తం మారిపోయేలా ఉంది. ఏకంగా 25 మెడల్స్ గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ మనోళ్ల ముందర ఉంది. ముఖ్యంగా బాక్సింగ్ రింగ్‌లోనే 10 మంది టీమిండియా ప్లేయర్లు పక్కా గోల్డ్ మెడల్స్ కోసం ఫైనల్లో పోరాడబోతున్నారు. ఆ 25 పతకాలు ఏ ఏ గేమ్స్ లో రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బాక్సింగ్:
* మహిళల 51 కేజీల విభాగం: సాక్షి
* మహిళల 54 కేజీల విభాగం: ప్రీతి
* మహిళల 57 కేజీల విభాగం: జాస్మైన్
* పురుషుల 55 కేజీల విభాగం: జాదుమణి
* మహిళల 60 కేజీల విభాగం: ప్రియా
* మహిళల 70 కేజీల విభాగం: లవ్లీనా బొర్గోహైన్
* పురుషుల 60 కేజీల విభాగం: సచిన్
* పురుషుల 80 కేజీల విభాగం: అంకుష్ పంగల్
* పురుషుల 90+ కేజీల విభాగం: నరేందర్

అథ్లెటిక్స్:
* పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్ (2 పతకాలు): ప్రవీణ్ చిత్రావెల్, సెల్వ ప్రభు తిరుమరన్
* మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ (2 పతకాలు): ప్రియాంకా గోస్వామి, రవీనా గైక్వాడ్
* పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్ (2 పతకాలు): దేవ్ కుమార్ మీనా, కుల్దేప్ కుమార్
* పురుషుల 5,000 మీటర్లు వాక్ ఫైనల్ (1 పతకం): గుల్వీర్ సింగ్
* మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే ఫైనల్ (1 పతకం): భారత బృందం

పారా అథ్లెటిక్స్:
* పురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్ (2 పతకాలు): సోమన్ రానా, శుభమ్ జుయల్
* పురుషుల 1500 మీటర్ల T54 ఫైనల్ (1 పతకం): రమేశ్ షణ్ముగం

జూడో:
* మహిళల 63 కేజీల విభాగం (రౌండ్ 16): ఉన్నతి శర్మ
* పురుషుల 90 కేజీల విభాగం (రౌండ్ 16): కరంజిత్ సింగ్ మాన్
* పురుషుల 81 కేజీల విభాగం (క్వార్టర్ ఫైనల్): హర్ష్ టోకస్
* మహిళల 70 కేజీల విభాగం (క్వార్టర్ ఫైనల్): ఇనుంగని తఖెల్లాంబమ్

ALSO READ : భారత్ 2027 వరల్డ్‌కప్ జర్నీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News