Dailyhunt
కార్మేని సెల్వం మధ్యతరగతి కుటుంబ కథ

కార్మేని సెల్వం మధ్యతరగతి కుటుంబ కథ

V6 Velugu 1 month ago

'కార్మేని సెల్వం' కథతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుందని చిత్ర దర్శకుడు రామ్ చక్రి చెప్పాడు.

సముద్ర ఖని ప్రధాన పాత్రలో ఆయన రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ చక్రి మాట్లాడుతూ 'ఈ సినిమా మధ్య తరగతి జీవితంపై ఆధారపడి ఉంటుంది. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీస్‌లో అప్పులు అనేవి కామన్‌గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది రియలిస్టిక్‌గా చూపించబోతున్నాం.

కుటుంబంలోని పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా వారు తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలవాలనే ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకున్నాం. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది.

ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. సముద్రఖని ఆయన పాత్రలోని ప్రతి షేడ్‌ను అద్భుతంగా పండించారు. మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్‌ను పండించారు. ఆయనతోపాటు గౌతమ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి' అని చెప్పాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News