Dailyhunt
కార్పొరేటర్‌పై కరెంట్ ఉద్యోగుల ఫిర్యాదు

కార్పొరేటర్‌పై కరెంట్ ఉద్యోగుల ఫిర్యాదు

V6 Velugu 0 months ago

గోదావరిఖని, వెలుగు: కరెంట్​సప్లై విషయంలో సమాధానం చెప్పినప్పటికీ తనను బూతులు తిడుతూ చంపుతానని బెదిరించిన రామగుండం కార్పొరేషన్​ 38వ డివిజన్​ కార్పొరేటర్​ నెలకంటి రాముపై కరెంట్​ఉద్యోగులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మంగళవారం మధ్యాహ్నం కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడగా కార్పొరేటర్​ రాము తనకు ఫోన్​ చేసి కరెంట్​ ఎప్పుడు వస్తుందని అడిగాడని రామగుండం-మల్యాలపల్లి 33 కేవీ సబ్​స్టేషన్​ నుంచి ఇన్​కమింగ్​ లేదని సమాధానమిచ్చినట్లు గోదావరిఖని ఈస్ట్​ సెక్షన్​ లైన్‌మెన్​ రాచకట్ల శ్రీనివాస్ తెలిపారు.

కాగా తాను సమాధానం చెప్పినా వినకుండా బూతులు తిడుతూ చంపుతానని బెదిరిస్తూ తన విధులకు ఆటంకం కలిగించాడని బాధితుడు తెలిపారు. ఈ విషయంలో విచారణ చేసి కార్పొరేటర్​పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News