హోం
కరీంనగర్‌లో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

కరీంనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో TRSV,BJP కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్వీ సంజయ్ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం చేపట్టింది. విషయం తెలిసిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాలను వారించే ప్రయత్నం చేశారు. ఇరుపార్టీల నేతలు రోడ్డుకు రెండు వైపుల బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. అక్రమంగా అరెస్టు చేసి.. బలవంతంగా వాహనాల్లోకి నెట్టి, కుక్కారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
For More News..
పులిని వండుకుతిన్న వేటగాళ్లు..
బుద్దిమారని పాక్.. బార్డర్‌లో బయటపడ్డ భారీ సొరంగం
హైదరాబాద్‌లో 90కి దగ్గర్లో పెట్రోల్ రేటు
related stories
-
హెరాల్డ్ కార్డ్స్ ప్రకాశం : టంగుటూరు టోల్ గేటు వద్ద పోలీసుల తనిఖీలు..నెల్లూరు నుండి వినుకొండకు...
-
జిల్లా వార్తలు ఢిల్లీ రైతులకు మద్దతుగా మహిళల ప్రదర్శన
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం...నిర్వహించి తీరుతామన్న టీడీపీ