Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కష్టపడే వారికి చేయూత అందిస్తా..రూ.72 లక్షల విలువైన 91  టీ స్టాల్స్ పంపిణీ  : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

కష్టపడే వారికి చేయూత అందిస్తా..రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ పంపిణీ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

V6 Velugu 1 week ago

సిద్దిపేట టౌన్, వెలుగు : కష్టపడి వ్యాపారం చేసుకొనే వారికి ఎల్లప్పుడూ తన ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం నియోజకవర్గం లో రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ ను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గం లో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి, మరింత ఊతం ఇచ్చేందుకు సహాయం గా నెక్ సహకారం తో సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల వారికి టీ స్టాల్స్​ను పంపిణీ చేసినట్లు చెప్పారు. అనంతరం సిద్దిపేట పట్టణం 3 వార్డ్ లోని బృందంవన్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. పదేండ్లలో సిద్దిపేట ను క్లీన్, గ్రీన్, సేఫ్ సిద్దిపేట గా మార్చుకున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎర్ర యాదయ్య, మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీకి అభినందన

సిద్దిపేట రూరల్ మండల సర్పంచుల ఫోరం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెద్దలింగారెడ్డిపల్లి సర్పంచ్ బట్టు భాస్కర్ రెడ్డిని ఎన్నుకోగా, ఉపాధ్యక్షుడిగా రాంపూర్ సర్పంచ్ కోడూరు మమత రాజు, బండచెరువుపల్లి సర్పంచ్ పొన్నల నాగరాజ ను ఎన్నుకున్నారు. నూతన కమిటీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News