హైదరాబాద్ : సిటీ నడిబొడ్డున ఉన్న KBR పార్క్ చుట్టూ వేట్రాఫిక్ తో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. ప్రతి రోజూ ట్రాఫిక్ జామ్ లతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, అటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉదయం 8గంటలనుంచి ఆఫీసులు, స్కూళ్లు ఓపెన్ అయ్యే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు.
వన్ వేలో ఉన్న జర్నలిస్టు కాలనీ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతుండటంతో ఆఫీసులు, స్కూళ్లకు ఆలస్యం కావడం అవుతోందని కమ్యూటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు.
రెండేళ్ల పాటు వన్ వే విధానాన్ని అమలు చేస్తోంది. అయితే పార్కు చుట్టూ రోడ్లపై డివైడర్లతో ఇరుకుగా ఉండటంతో వన్ వే విధానాన్ని అమలు చేస్తున్న కమ్యూటర్స్ కి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే మరో రెండేళ్ల పాటు ప్రయాణికులకు తీవ్రఇబ్బందులు తప్పవని, వెంటనే పరిష్కారం దిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ణప్తి చేస్తున్నారు.

