Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేటీఆర్కు పనిపాటా లేక కాళేశ్వరం వెళ్లిండు..ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్

కేటీఆర్కు పనిపాటా లేక కాళేశ్వరం వెళ్లిండు..ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్

V6 Velugu 1 week ago

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్​కు పనిపాటా లేక కాళేశ్వరం వెళ్లాడని విప్​ అద్దంకి దయాకర్ ​విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల​చేశారు.

బీఆర్ఎస్ హయాంలోని కన్నెపల్లి పంప్​హౌజ్ నీట మునిగి బాహుబలి మోటార్లన్నీ పాడైన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు.

కాళేశ్వరం వెళ్లకుండా కేటీఆర్​ను ఎవరూ ఆపలేదని, ఒకవేళ ప్రభుత్వం ఆపితే కన్నెపల్లికి ఆయన ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. కేసీఆర్​ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతే ఎవరో బాంబులు పెట్టి పేల్చారని చెప్పుకున్న చరిత్ర వారిదని మండిపడ్డారు. గేమ్ ప్లాన్​లో భాగంగా కేటీఆర్ కాళేశ్వరం వెళ్లాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News