Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిచెన్ క్లీన్‌గా.. ఆరోగ్యం సేఫ్‌గా: వంటగదిని బ్యాక్టీరియా ఫ్రీగా మార్చేయండి ఇలా!

కిచెన్ క్లీన్‌గా.. ఆరోగ్యం సేఫ్‌గా: వంటగదిని బ్యాక్టీరియా ఫ్రీగా మార్చేయండి ఇలా!

V6 Velugu 1 week ago

వంటగది క్లీన్ గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తినడమే కాదు ఆ ఫుడ్ ని వండే కిచెన్ ని కూడా మంచిగా ఉంచుకోవాలన్నమాట. కిచెన్ ని క్లీన్ గా ఉంచడానికి ఈ టిప్స్ పాటిస్తే హెల్తీగా, హ్యాపీగా ఉంటారు.

ఉదయాన్నే స్నానం చేసి లేదా కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే వంటగదిలోకి వెళ్లాలి. ఇది అలవాటుగా మారితే చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకున్నట్లే.

స్టవ్ చుట్టూ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. స్టవ్ మీద ఉండే మరకలను ఎప్పటికప్పుడు తుడిచి, శుభ్రం చేయాలి. వాటిని అలా వదిలేస్తే బాక్టీరియా పెరుగుతుంది. అది వండే వాటిలోకి చేరుతుంది. వంటచేసే చోట ఒక్కసారి వెనిగర్ చల్లి తుడిస్తే బాక్టీరియా చనిపోతుంది.

జ్యోతిష్యం : మిధున రాశిలో తిరోగమనంలో బుధుడు .. భద్ర రాజయోగంతో మూడు రాశుల వారికి లాభాలు..!

వంటగదిలోకి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కిటికీలను తెరిచిన తర్వాత వంట మొదలుపెట్టాలి.

కిచెన్ ని క్లీన్ చేసేందుకు వాడే కెమికల్ ని ఆహార పదార్ధాలు, వంట దినుసులకు దూరంగా పెట్టాలి.

వంటగదిని ప్రతిరోజూ క్లీన్ చేయాలి. వారానికి ఒకసారి వస్తువులన్నీ తీసి, వాటిని శుభ్రం చేసిన తర్వాత సర్దాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News