Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొలువుల పండుగ.. పోలీస్‌, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీఎఫ్లో 7,437 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌..

కొలువుల పండుగ.. పోలీస్‌, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీఎఫ్లో 7,437 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌..

V6 Velugu 2 weeks ago
  • యూనిఫామ్​సర్వీస్లో త్వరలో నోటిఫికేషన్‌..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీసు శాఖతోపాటు అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందన్నారు. స్థానిక కేడర్ వారీగా పోస్టుల పంపిణీ, రోస్టర్ పాయింట్లు తదితర వివరాలను హోంశాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వివరాల సేకరణ పూర్తికాగానే నియామక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను విభాగాల వారీగా వెల్లడించారు.

పోలీస్‌ శాఖలో పోస్టులు

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్ (సివిల్) 148
  • రిజర్వ్‌ ఎస్‌ఐ (ఏఆర్) 14
  • రిజర్వ్‌ ఎస్‌ఐ (టీజీఎస్పీ) 12
  • రిజర్వ్‌ ఎస్‌ఐ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) 3
  • అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్
  • (ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ) 23
  • పోలీసు కానిస్టేబుల్ (సివిల్) 3,697
  • కానిస్టేబుల్ (ఏఆర్) 1,052
  • కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) 24
  • కానిస్టేబుల్ (డ్రైవర్) 20
  • కానిస్టేబుల్ (మెకానిక్) 7

అగ్నిమాపక శాఖలో పోస్టులు

  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39
  • ఫైర్ ఫైటర్ 751

జైళ్ల శాఖలో..

  • డిప్యూటీ జైలర్ (పురుషులు) 14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు) 01
  • వార్డర్ (పురుషులు) 196
  • వార్డర్ (మహిళలు) 12
  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్ 44
  • కానిస్టేబుల్ 1,380
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News