జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి చేశారు ఆలయ సిబ్బంది. ఇటీవల నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతితో పాటు గడిచిన 34 రోజుల హుండీ ఆదాయాన్ని శుక్రవారం (2026 మే 22) లెక్చించారు.
గడిచిన 34 రోజుల హుండీ ఆదాయం కోటీ 8 లక్షల 64 వేల 164 రూపాయలు వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈఓ ఎస్.అంజనారెడ్డి , ఏఈఓ హరిహరనాథ్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి సమక్షంలో భారీ భద్రత నడుమ హుండీల లెక్కింపు పూర్తి చేశారు. లెక్కింపు సందర్భంగా వచ్చిన బంగారం, వెండిని తిరిగి హుండీలో భద్రపరిచినట్లు తెలిపారు.
ఫిబ్రవరిలో లెక్కించిన 43 రోజుల హుండీ ఆదాయం కోటి 16 లక్షల 4 వేల 438 రూపాయల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కేవలం 34 రోజులకే పెద్దమొత్తంలో ఆదాయం సమకూరినట్లు చెప్పారు ఆలయ ఈవో.

