Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త వారం దిగొచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. కేజీకి రూ.10 వేలు తగ్గిన వెండి

కొత్త వారం దిగొచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. కేజీకి రూ.10 వేలు తగ్గిన వెండి

V6 Velugu 1 week ago

అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయంగా ప్రభుత్వ ఆంక్షలు బంగారం, వెండిని వెలవెలబోయేలా చేస్తున్నాయి. దీంతో డిమాండ్ తగ్గి వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో రిటైల్ షాపింగ్ చేసేవారు ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించి ముందుకెళ్లటం బెటర్.

జూలై 6న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.11 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 662గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 440గా కొనసాగుతోంది.

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 6, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు తగ్గి రూ.2లక్షల 50వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News