Dailyhunt
కొత్తరకం హ్యూమర్‌తో గాయపడ్డ సింహం

కొత్తరకం హ్యూమర్‌తో గాయపడ్డ సింహం

V6 Velugu 3 weeks ago

'గాయపడ్డ సింహం' చిత్రంలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేశానని నటుడు జేడీ చక్రవర్తి చెప్పాడు. తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రంలో జేడీ కీలక పాత్ర పోషించాడు.

ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.

సోమవారం జేడీ చక్రవర్తికి సంబంధించి గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో బ్రూటల్ ధర్మగా ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ 'యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్ గారు ఒక కొలమానం. ఆయన చేసిన అన్ని క్యారెక్టర్లు వరల్డ్ సినిమా హిస్టరీలో ఎవ్వరూ చేయలేదు, చేయబోరు. అయితే క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్ గారు కూడా ఇలాంటి పాత్ర చేసి ఉండరు.

అంత గొప్ప పాత్ర ఇందులో చేశాను. నా కెరీర్‌లో మనీ, సత్య, అనగనగా ఒక రోజు చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం దొరికింది. కొత్తరకం హ్యూమర్ వున్న సినిమా ఇది. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు' అని అన్నాడు. ఈ చిత్రంలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని ప్రెజెంటర్ పవన్ సాధినేని చెప్పాడు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్, ప్రొడ్యూసర్ భాను కిరణ్ ప్రతాప్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News