Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుత్బుల్లాపూర్: 10 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్

కుత్బుల్లాపూర్: 10 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్

V6 Velugu 1 week ago

కుత్బుల్లాపూర్, వెలుగు: అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 10 మంది నకిలీ డాక్టర్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్​ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

మేడ్చల్, సంగారెడ్డి, పటాన్​చెరువు, అర్సీపురం, జగద్గిరిగుట్ట, సూరారం, బాచుపల్లి తదిరప్రాంతాల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారనే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు జిల్లా మెడికల్​ ఆఫీసర్స్​తో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంటర్, టెన్త్ చదివిన వారు ఆర్ఎంపీలుగా చెలామణీ అవుతూ ఏకంగా క్లినిక్​లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.

వి.బుచ్చయ్య, సుధాకర్​చారి, డి.అంజాగౌడ్, రమావత్​ ప్రకాష్, మేకల అక్షయ్​కుమార్, కె.నారాయణ, జి.ప్రహ్లాద్, కొనపాల బుచ్చయ్యబాబు, ఎస్. శ్రీనివాస్​రావు, పి.గంగారాంను అరెస్ట్​ చేశారు. వారి వద్ద వైద్యానికి ఉపయోగించే సామగ్రి, గడువు మగిసిన మందులు, సిరంజీలు, సెలైన్​ బాటిళ్లు​స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News