Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లండన్ స్క్వాష్ క్లాసిక్ చాంపియన్షిప్‌లో రెండో రౌండ్లోకి అనహత్‌

లండన్ స్క్వాష్ క్లాసిక్ చాంపియన్షిప్‌లో రెండో రౌండ్లోకి అనహత్‌

V6 Velugu 1 week ago

లండన్‌: ఇండియా జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌ అనహత్‌ సింగ్‌.. లండన్‌ స్క్వాష్‌ క్లాసిక్‌ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్‌ సింగిల్స్ తొలి రౌండ్‌లో వరల్డ్‌ 20వ ర్యాంకర్‌ అనహత్‌ 11-3, 11-2తో మరియమ్‌ మెట్‌వల్లి (ఈజిప్ట్‌)పై వరుస గేమ్‌ల్లో ఏకపక్ష విజయం సాధించింది.

గత రెండు సీజన్ల నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఇండియన్‌ ప్లేయర్‌ అదే జోరును ఈ టోర్నీలోనూ కొనసాగించింది. కనీసం ప్రత్యర్థికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. బలమైన షాట్లతో వరుసగా పాయింట్లు గెలిచింది.

మెన్స్‌ సింగిల్స్‌లో వరల్డ్‌ 42వ ర్యాంకర్‌ రమిత్‌ టాండన్‌ 11-6, 11-7తో అబ్దుల్లా అల్‌ తమీమ్‌ (ఖతార్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. మరో మ్యాచ్‌లో వరల్డ్‌ 38వ ర్యాంకర్‌ వీర్‌ ఛోత్రానీ 9-11, 9-11తో యాన్నిక్‌ విల్‌హెల్మీ (స్విట్జర్లాండ్‌) చేతిలో పోరాడి ఓడాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News