Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లష్కర్ బోనాలకు రండి..గవర్నర్ శివపత్రాప్ శుక్లాకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

లష్కర్ బోనాలకు రండి..గవర్నర్ శివపత్రాప్ శుక్లాకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హనుమంతరావు ఆహ్వానించారు.

గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా పూజారులు వేద మంత్రాలతో గవర్నర్‌ను ఆశీర్వదించారు.

మాజీ పీసీసీఎఫ్ పరేష్ కుమార్ శర్మ రచించిన 'ఫుట్‌ప్రింట్స్ ఇన్ ది ఫారెస్ట్స్-మెమోయర్స్ ఆఫ్ ఎ ఫారెస్టర్' పుస్తకాన్ని గవర్నర్ లోక్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అటవీ సంపద, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఏఎస్ పబ్లిష్‌కు చెందిన సుప్రియా భలే రావు, డాక్టర్ మనోరంజన్ భంజా, సైకాలజీ కౌన్సిలర్ నేహా వ్యాస్ పాల్గొన్నారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద మహారాజ్ గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News