Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లీటర్ పాలు 102 రూపాయలా.. పొద్దుపొద్దునే షాక్ ఇచ్చిన వ్యాపారులు

లీటర్ పాలు 102 రూపాయలా.. పొద్దుపొద్దునే షాక్ ఇచ్చిన వ్యాపారులు

V6 Velugu 2 weeks ago

గుడ్ మార్నింగ్ ముంబై అంటూ నిద్ర లేచిన ముంబై సిటీ.. జస్ట్ కొన్ని నిమిషాల్లోనే షాక్ అయ్యింది. పొద్దున లేచి టీ, కాఫీ అంటూ ఉత్సాహంగా అడిగే వాళ్ల నోళ్లు..

నోరెళ్లబెట్టాయి. టీవీ, పేపర్ చూసినోళ్లు అవాక్కయ్యారు.. ఉదయం ఫ్రెష్ గా టీ, కాఫీ కోసం బయటకు వచ్చిన కుర్రోళ్లు షాక్ అయ్యారు. ఇదంతా ఎందుకు అంటారా.. లీటర్ పాల ధర 9 రూపాయలు పెరిగింది. ఈ క్రమంలోనే లీటర్ గేదె పాలు 102 రూపాయలకు చేరింది. 2026, సెప్టెంబర్ ఒకటో తేదీ పొద్దుపొద్దునే పాల వ్యాపారులు ఇచ్చిన షాక్ తో ఫ్యామిలీల మైండ్ బ్లాంక్ అయ్యింది. లీటర్ గేదెపాలు.. అది కూడా రెగ్యులర్ పాల ధర లీటర్ 102 రూపాయలకు చేరటంతో ముంబైకర్లు షాక్ అవుతున్నారు.

ముంబైలో పాల ధరను సడెన్ గా పెరగటంతో జనాలు షాకింగ్ కు గురవుతున్నారు. 2026 సెప్టెంబర్ 1వ తేదీన ఒక్కసారిగా లీటర్ పాలపై 9 రూపాయలు పెరిగింది. డెయిరీల నుంచి, పాల వ్యాపారుల నుంచి అమ్మే హోల్ సేల్ గా అమ్మే తేదెపాలు 93 రూపాయల నుంచి 102కు చేరుకుంది. పశువుల మేత (గ్రాసం) ధరలు 25 శాతం పెరగటంతోనే పాల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

రోజుకు రెండు కప్పుల టీ తగ్గించాల్సి వస్తుంది:

పాల ధరలు పెరిగితే, టీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల ఒక కప్పు టీ ధర రూ. 10 నుంచి రూ. 12కి చేరుతుంది. రోజుకు నాలుగు లేదా ఐదు కప్పుల టీ తాగే మా లాంటి వారు, ఇకపై కేవలం రెండు కప్పులకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పటికే చక్కెర ధర కిలోకు రూ. 40 నుంచి రూ. 70కి పెరిగింది, అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. ఒక టాక్సీ డ్రైవర్‌గా, ఇది నా ఆదాయం, కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని స్థానిక టాక్సీ డ్రైవర్ ఆవేదన చెందుతున్నాడు.

బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు:

మనం వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) దిశగా అడుగులు వేస్తున్నాం. దేశం ఎంతగా పురోగమిస్తుందో చూడండి... అన్నింటి ధరలు పెరిగాయి, కానీ ఎవరి జీతాలూ పెరగలేదు. నిరుద్యోగం పెరిగింది... నవ భారత్ ను మనం ఇలాగే నిర్మించబోతున్నామా? అంటూ ధరల పెరుగుదలపై ...AIMIM నేత వారిస్ పఠాన్ విమర్శలకు దిగారు.

ప్రభుత్వం దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడానికి డబ్బుంది..ఆపరేషన్ లోటస్ ను అమలు చేయడానికి, మాత్రమే ఆ డబ్బును ఉపయోగిస్తున్నారు అని అన్నారు. ధరలు ఎంత వేగంగా పెరిగితే.. బీజేపీ ప్రభుత్వ ప్రజాదరణ గ్రాఫ్ అంత వేగంగా పడిపోతుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ మొదలైంది. వారు అధికారం నుంచి దిగిపోయే సమయం దగ్గర్లోనే ఉంది అంటూ విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News