Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మా నాన్నే బెస్ట్ ఛాయిస్: విజయ్‌పై ప్రేమ చాటుకున్న కుమారుడు జేసన్ సంజయ్.. అన్‌ఫాలో రూమర్లకు చెక్?

మా నాన్నే బెస్ట్ ఛాయిస్: విజయ్‌పై ప్రేమ చాటుకున్న కుమారుడు జేసన్ సంజయ్.. అన్‌ఫాలో రూమర్లకు చెక్?

V6 Velugu 2 weeks ago

మిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు సినీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో కుమారుడైనా, హీరోగా కాకుండా దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.

ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం 'సిగ్మా' షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న జేసన్ సంజయ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు.

ఇంటర్వ్యూలో భాగంలో జేసన్‌కు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. 'హాలీవుడ్ యాక్షన్ స్టార్ జేసన్ స్టాథమ్ (Jason Statham) తో సినిమా చేసే అవకాశం వస్తే, తమిళ సినీ పరిశ్రమ నుంచి ఏ నటుడిని ఎంపిక చేస్తారు?'అని అడగ్గా.. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా 'మా నాన్న విజయ్'అని సమాధానమిచ్చారు. అలాగే 'విజయ్ - జేసన్ స్టాథమ్ కాంబినేషన్ స్క్రీన్పై అద్భుతంగా ఉంటుంది. అయితే నా ఈ సమాధానం సోషల్ మీడియాలో కచ్చితంగా మంచి మీమ్ మెటీరియల్‌గా మారే అవకాశం ఉంది'అంటూ జేసన్ నవ్వుతూ బదులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా కాదు.. మొదటి కల పైలట్ కావడమే..

చిన్నప్పటి నుంచే సినిమా సెట్లకు వెళ్లే అవకాశం రావడం వల్ల చిత్ర నిర్మాణంపై ఆసక్తి పెరిగిందని జేసన్ తెలిపారు. అయితే మొదట్లో తన లక్ష్యం సినిమా కాదని వెల్లడించారు."మొదట నేను పైలట్ కావాలని అనుకున్నాను. ఒక దశలో క్రికెటర్ అవ్వాలనిపించింది కూడా. ఇంటర్ (11, 12వ తరగతి) చదివే సమయంలో సినిమాపై ఆసక్తి పెరిగింది. కాలేజీకి వెళ్లే సమయానికి ఫిల్మ్‌మేకింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను" అని జేసన్ సంజయ్ తెలిపారు. దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్న జేసన్ సంజయ్ రూపొందించిన 'సిగ్మా' సినిమాపై తమిళ సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అన్‌ఫాలో ప్రచారం వేళ.. క్లారిటీ ఇచ్చినట్లేనా?

ఇదిలా ఉండగా, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విజయ్, ఆయన కుమారుడు జేసన్ సంజయ్‌ల మధ్య విభేదాలు ఉన్నాయని, జేసన్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో 'అన్‌ఫాలో' చేశారంటూ రకరకాల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఈ రూమర్లు నడుస్తున్న సమయంలోనే జేసన్ సంజయ్ తన తండ్రి గురించి ఎంతో సానుకూలంగా, గౌరవప్రదంగా మాట్లాడటం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను జేసన్ బహిరంగంగా వ్యక్తపరచడంతో రూమర్లకు చెక్ పడినట్లయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ అన్‌ఫాలో అంశంపై ఇప్పటివరకు విజయ్ లేదా జేసన్ సంజయ్ ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక ఈ లేటెస్ట్ కామెంట్స్తో దళపతి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

తండ్రి కోసం కొడుకు త్యాగం..?

దర్శకుడిగా జేసన్ సంజయ్ తెరకెక్కించిన తొలి చిత్రం 'సిగ్మా' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ హైస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తొలుత జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తన తండ్రి విజయ్ 'జన నాయగన్' విడుదలకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో రెండు సినిమాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు 'సిగ్మా'ను ఆగస్టుకు వాయిదా వేయాలని నిర్మాతలు ఆలోచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News