Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మదర్ థెరిసా జయంతిని విస్మరించడం తగదు : జెరూసలేం మత్తయ్య

మదర్ థెరిసా జయంతిని విస్మరించడం తగదు : జెరూసలేం మత్తయ్య

V6 Velugu 1 week ago
  • క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య

పద్మారావునగర్, వెలుగు: మదర్ థెరిసా జయంతిని ప్రభుత్వం విస్మరించడం తగదని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య అన్నారు.

సికింద్రాబాద్‌లోని ఆమె విగ్రహం వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మదర్​థెరిసా విగ్రహానికి నివాళి అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెక్యులరిజం, మానవత్వం గురించి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం మదర్ థెరిసాను అవమానించిందని ఆరోపించారు. జయంతికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ మదర్ థెరిసా చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎడ్వర్డ్ శామ్యూల్ 20 రోజుల ముందే మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించారని, అయినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News