Dailyhunt
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కారు బావిలో పడి 9 మంది జలసమాధి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కారు బావిలో పడి 9 మంది జలసమాధి

V6 Velugu 1 week ago

హారాష్ట్రలో హృదయ విధారక ఘటన జరిగింది. కారు బావిలో పడి కుటుంబం మొత్తం జలసమాధి కావడం విషాదాన్ని మిగిల్చింది. 2026 ఏప్రిల్ 03 రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో మృతుల్లో 6 మంది చిన్నారులు ఉండటం కలచివేసింది.

నాశిక్ కు 40 కి.మీ. దూరంలో దిండోరీ తాలుకలో జరిగింది ఈ ఘోర ప్రమాదం.

మహారాష్ట్రలోని నాసిక్‌లో, రోడ్డు పక్కన ఉన్న ఒక బావిలోకి మారుతి XL6 కారు దూసుకెళ్లడంతో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలతో సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

  • ఫ్యామీలి జలసమాధి:

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, మృతులందరూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఒకే ఫ్యామిలీకి చెందిన వారు. మృతుల్లో 34 ఏళ్ల సునీల్ దత్తాత్రేయ దర్గోడే, ఆయన భార్య 30 ఏళ్ల రేష్మ, వారి కుమార్తె 10 ఏళ్ల రాఖీ (అలియాస్ గుణవంతి), అలాగే మేనకోడళ్లు 13 ఏళ్ల మాధురి, 11 ఏళ్ల శ్రేయష్, కుమార్తె 14 ఏళ్ల సృష్టి,11 ఏళ్ల శ్రావణి, 7 ఏళ్ల సమృద్ధి ఉన్నారు.

ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహించిన సోషల్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. NDRF బృందం కూడా ఘటనా స్థలంలో ఉండి, సహాయక చర్యలను రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగించి మృతులను బయటకు తీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News