Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తెలంగాణ పోలీసులపై దాడి

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తెలంగాణ పోలీసులపై దాడి

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్: మహారాష్ట్రలో తెలంగాణ పోలీసులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఓ నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు.

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్‎లో ఆదిలాబాద్ జిల్లా పోలీసులపై దాడి జరిగింది.

చిక్లి గ్రామంలో కరుడుగట్టిన షేక్ వకార్ అనే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లగా స్థానికులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై బీజేపీ దాడి

విధుల నిర్వహణలో తమపై దాడి చేసిన వారిపై ఆదిలాబాద్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News