Dailyhunt
మలద్వారంలో గాలి పెట్టిన స్నేహితుడు..కొద్దిసేపటికే యువకుడు మృతి

మలద్వారంలో గాలి పెట్టిన స్నేహితుడు..కొద్దిసేపటికే యువకుడు మృతి

V6 Velugu 1 week ago

షాద్ నగర్, వెలుగు: స్నేహితుల మధ్య జరిగిన చిన్న తమాషా ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట దగ్గరున్న విజయ నేహా కంపెనీలో యూపీకి చెందిన పవన్ (20), సాయి అనే యువకులు పని చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం వీరిద్దరూ సరదాగా ఆడుకుంటున్న సమయంలో, సాయి కంపెనీలో వాడే గాలి పైపును పవన్ మలద్వారం వద్ద పెట్టాడు.

దీంతో గాలి శరీరంలోకి వెళ్లడంతో పవన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. హాస్పిటల్​కు తరలించేలోపే మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ సీతారాం తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News