Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మనోజ్ బాజ్‌పేయీ 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' టీజర్ విడుదల.. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్

మనోజ్ బాజ్‌పేయీ 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' టీజర్ విడుదల.. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్

V6 Velugu 2 weeks ago

నోజ్ బాజ్ పేయి లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్'. హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా నిర్మించిన ఈ చిత్రానికి బెన్ రెఖ్ దర్శకత్వం వహించారు.

బుకర్ ప్రైజ్ విజేత అరవింద్ అడిగా రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కించారు.

గురువారం ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ముంబైలోని పాత హౌసింగ్ సొసైటీని కూల్డి లగ్జరీ టవర్ నిర్మించడానికి ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ భారీ మొత్తంలో నష్టపరిహారం ఆవర్ చేస్తాడు. ఆ సొసైటీలోని వాళ్లంతా అంగీకరిస్తారు, కానీ రిటైర్డ్ సైన్స్ టీచర్ యోగేష్ మూర్తి ఒప్పుకోడు. తన జ్ఞాపకాలు, ఆత్మగౌరవాన్ని డబ్బు కోసం తాకట్టు పెట్టడానికి అతను నిరాకరిస్తాడు. డెవలపర్ నుంచి బెదిరింపులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఒత్తిడి, సామాజిక బహిష్కరణలను ఎదుర్కొంటూ అతమ ఎలాంటి పోరాటాన్ని చేశాడనేది మెయిన్ కాన్సెప్ట్. బోమన్ ఇరానీ, దివ్య దత్తా కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 11న థియేటర్స్ లో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News