Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడల్ స్కూళ్లలో 8గంటల పని విధానం అమలు చేయాలె: సీఐటీయూ నేతల వినతి

మోడల్ స్కూళ్లలో 8గంటల పని విధానం అమలు చేయాలె: సీఐటీయూ నేతల వినతి

V6 Velugu 6 days ago

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన జీవో 60 ప్రకారం మోడల్ స్కూల్ హాస్టళ్లలో వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ హాస్టల్స్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రభుత్వాన్ని కోరింది.

మోడల్ గంటల వెట్టిచాకిరీని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని తీసుకురావాలని కోరింది. సోమవారం యూనియన్ ప్రతినిధులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జీవో 60 ప్రకారం హైలీ స్కిల్డ్ వర్కర్లకు రూ. 22,750, స్కిల్డ్ వర్కర్లకు రూ.

19,500, సెమీ స్కిల్డ్ వారికి రూ. 15,600 వేతనాలను అమలు చేయాలని కోరారు. ఇప్పుడున్నట్లుగా హాస్టల్ అకౌంట్ నుంచే నేరుగా జీతాలు ఇవ్వాలనీ విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News