Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడేళ్లుగా అద్దె చెల్లించలేదని  వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం..

మూడేళ్లుగా అద్దె చెల్లించలేదని వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం..

V6 Velugu 2 weeks ago

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేయడం సంచలనం రేపింది.

గత మూడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయానికి సరైన సమయానికి అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి బకాయిలు చెల్లించకుండానే, హటాత్తుగా కార్యవిధ్యాన్ని మార్కెట్‌యార్డుకు తరలిస్తుండటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కార్యాలయాన్ని ఖాళీ చేయాలని యజమాని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అద్దె బకాయిల వివాదం కారణంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం మూతపడటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News