Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నైజాంలోనే 42 లక్షల మంది చూశారు.. ఇరుముడి సక్సెస్ సర్ప్రైజ్ చేసింది

నైజాంలోనే 42 లక్షల మంది చూశారు.. ఇరుముడి సక్సెస్ సర్ప్రైజ్ చేసింది

V6 Velugu 3 days ago

వితేజ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన 'ఇరుముడి' చిత్రం రికార్డ్‌ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ పేరుతో సక్సెస్‌ మీట్ నిర్వహించారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ 'సినిమా చూసిన వాళ్లంతా ఇది మన కథ, మన ఇంట్లో ఒక ఆడపిల్ల కథ, మన అమ్మానాన్నల కథ అని పీల్ అవుతున్నారు.

ప్రేక్షకులు రవితేజ గారిని త్రినాధ్‌ అనే పాత్రలో చూడటం వర్కవుట్ అయింది. ఇందులోని ఎమోషన్‌, రియలిస్టిక్‌ వరల్డ్‌తో పాటు కథలోని మూడు అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యాయి. మూడు జనరేషన్స్ చూస్తున్న సినిమా కాబట్టి జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ అని పేరు పెట్టాం' అని చెప్పారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ 'మంచి ఫలితం ముందే ఊహించాం. కానీ అంతకుమించిన అద్భుతమైన ఫలితం వచ్చింది. ఫుట్‌ఫాల్స్‌ సెన్సేషనల్‌గా ఉన్నాయి. కేవలం నైజాంలోనే 42 లక్షలమంది చూశారు' అని చెప్పారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ''ఇరుముడి' సినిమా ఒక మిరాకిల్.

ఇలాంటి విజయాలు అరుదుగా వస్తుంటాయి. రెండు, మూడు వారాలకు సినిమాల విజయం పరిమితం అవుతున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ సర్‌ప్రైజ్ చేసింది. ట్రెండ్‌ మార్చేసింది. రోజురోజుకీ టాక్ పెరుగుతోంది. సెప్టెంబర్ 10న విజయోత్సవ వేడుకకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల బేబి నక్షత్ర సంతోషం వ్యక్తం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News