Dailyhunt
నంబర్ ప్లేట్ లేని 70 వాహనాలు సీజ్

నంబర్ ప్లేట్ లేని 70 వాహనాలు సీజ్

V6 Velugu 1 week ago

​కరీంనగర్, వెలుగు: నగరంలో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు, బుధవారం నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంజీవ్ పర్యవేక్షణలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా సరైన నంబర్ ప్లేట్లు లేని, నంబర్ ప్లేట్లు సరిగ్గా కనిపించని, నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసిన 70 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News