Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్, బంగ్లాదేశ్ ఉద్యమాలు కాదు.. మన గాంధేయవాదమే మనకు ఆదర్శం:  కాక్రోచ్ పార్టీ చీఫ్

నేపాల్, బంగ్లాదేశ్ ఉద్యమాలు కాదు.. మన గాంధేయవాదమే మనకు ఆదర్శం: కాక్రోచ్ పార్టీ చీఫ్

V6 Velugu 2 weeks ago

భారత్ లో మహాత్మ గాంధీ వ్యతిరేక ప్రాపగాండ నడుస్తున్న సందర్భంలో.. గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకుని సరికొత్త జెన్-Z ఉద్యమాన్ని నిర్మించారు అభిజీత్ దీప్కే.

నీట్ లీక్ కు వ్యతిరేకంగా జెన్-జెడ్ యువతను ఉద్యమం వైపు నడిపించి విజయం సాధించారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టును నేపాల్, బంగ్లాదేశ్ ఉద్యమాలతో పోల్చుతుండటంపై ఆయన స్పందించారు.

సీజేపీ ఆందోళనలను నేపాల్, బంగ్లాదేశ్ లలో జరిగిన హింసాత్మక ఉద్యమాలతో పోల్చడాన్ని ఆయన కొట్టిపారేశారు. ఇండియన్ స్టూడెంట్స్ మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహాత్ముడు ఆచరించి చూపించిన అహింసా మార్గంలోనే తాము ఆందోళన చేసినట్లు మంగళవారం (ఆగస్టు 04) స్పష్టం చేశారు.

PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సీజేపీ ఉద్యమాన్ని అగౌరవ పరచడానికి బంగ్లాదేశ్, నేపాల్ ఉద్యమాలతో పోల్చుతున్నారని అన్నారు. రాజ్యాంగ నియమాలను అనుసరిస్తూ శాంతియుతంగా నిరసనలు చేశామని.. తమను అగౌరవ పర్చడానికే నేపాల్, బంగ్లాదేశ్ ఉద్యమాలతో పోల్చుతున్నారని అన్నారు.

2024లో బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయని బంగ్లాదేశీ రచయిత్రి షేక్ హసీనా చేసిన కామెంట్స్ కు ముడిపెడుతూ.. సీజేపీ ప్రొటెస్టును పోల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. మేము బంగ్లా, నేపాల్ వైపు చూడాల్సిన పనిలేదు.. ప్రపంచానికే ఆదర్శం అయిన మహాత్మా గాంధీ మాకు ఉన్నారు.. అని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా నేపాల్, బంగ్లా హింసాత్మక ఘటనలతో పోల్చతున్నారు కానీ.. స్టూడెంట్స్ ఎవరూ హింసకు పాల్పడలేదని తెలిపారు. శాంతియుతంగా నిరసనలు తెలిపి పోలీసుల దాడిలో తీవ్ర గాయాలపాలయ్యారు కానీ.. ఎక్కడా హింసకు పాల్పడలేదని తెలిపారు.

దేశ ఎన్నికల చట్రంలో విద్య అనేది సెంట్రల్ ఇష్యూ కావాలని ఆకాంక్షించారు. ఎలక్షన్లలో విద్య మెయిన్ ఎజెండా కాలేదంటే.. నువ్వు భవిష్యత్ గురించి ఆలోచించడం లేదని అర్థం. దేశ భవిష్యత్తుకు విద్యనే పెట్టుబడి అని ఈ సందర్భంగా అన్నారు.

నీట్ బాధిత కుటుంబాలకు పరిహారం అందటంలో ఇంకా ఆలస్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూల్చడానికి, ఎమ్మెల్యే, ఎంపీలకు కొనడానికి డబ్బు ఉంటుంది కానీ.. బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు డబ్బు ఉండదా అని ప్రశ్నించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News