Dailyhunt
Netflix Movies: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 6 కిల్లర్ కంటెంట్.. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఫుల్ ప్యాక్

Netflix Movies: ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 6 కిల్లర్ కంటెంట్.. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఫుల్ ప్యాక్

V6 Velugu 1 week ago

ప్రపంచవ్యాప్తంగా అనేక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ (Netflix) మాత్రం అత్యధిక సబ్‌స్క్రైబర్లతో ముందంజలో ఉంది. మిగతా ఓటీటీలతో పోలిస్తే, నెట్‌ఫ్లిక్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది.

దీనికి ప్రధాన కారణం నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే కంటెంట్ నాణ్యత. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చే సినిమాల్లో ఏదైనా బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌కు గ్లోబల్ స్థాయిలో మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.

ప్రస్తుతం క్రైమ్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్, డ్రామా వంటి ప్రతి జానర్‌కు చెందిన సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో విస్తృతంగా లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి జానర్ ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా కంటెంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ వారం (2026 April 3rd) ప్రేక్షకులను అలరించడానికి చాలా పెద్ద లిస్టుతోనే నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఏప్రిల్ 3 నాటికి స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, ఇప్పటికే వచ్చి ఆకట్టుకుంటున్న కంటెంట్ వైపు ఓ లుక్కేద్దాం..

'మృత్యుంజయ్‌'(Mrithyunjay):

శ్రీవిష్ణు హీరోగా సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ మూవీ 'మృత్యుంజయ్‌'(Mrithyunjay). మార్చి 6న విడుదలైన సినిమా థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. హుస్సేన్ రైటింగ్, ట్విస్ట్‌లు బాగా వర్కవుట్ అయ్యాయి. తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్‌లో ఇదొకటి.

సినిమాలో పాటలు, కామెడీ సీన్లు ఉండవు. కేవలం కంటెంట్‌తోనే ఆడియెన్స్ను ఎంగేజ్ చేసింది. ఇపుడు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏప్రిల్‌ 3న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి రానుంది. మైండ్ గేమ్ ఎలిమెంట్స్‌తో నడిచే థ్రిల్లర్ కథ కావడంతో ఓటీటీ ఆడియన్స్ కు పండుగనే చెప్పాలి.

మృత్యుంజయ్ కథ:

హైదరాబాద్‌లో ఒక పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో జయ్‌ (శ్రీ విష్ణు) ఉద్యోగం చేస్తాడు. 'శ్రద్ధాంజలి' ప్రకటన ఇవ్వించడమే అతని పని. అయితే, ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటున్న అతను, ఒక వారం వ్యవధిలో అనుమానాస్పదంగా జరిగిన రెండు మరణాలపై సందేహం పెంచుకుంటాడు.

వాటిలో ఒకటి చిన్నారి అంజలి (ఊహా రెడ్డి) తండ్రి అచ్యుత్‌రావు (బాలాదిత్య) మరణం. అది సహజ మరణం కాదని.. హత్య చేయబడిందని జయ్ అనుమానించి, ఏసీపీ సీతగా (రెబా మౌనిక జాన్) దృష్టికి తీసుకెళ్తాడు. అయితే ఆమె అది ప్రమాదమని భావిస్తుంది. చివరికి జయ్ తన అనుమానాన్ని ఎలా నిరూపించాడు? ఆ హత్యల వెనక నిజం ఏమిటి? అనేదే సినిమా కథ.

మామ్లా లీగల్ హై సీజన్ 2:

రవి కిషన్ నటించిన పాపులర్ కోర్ట్‌రూమ్ కామెడీ సిరీస్ మామ్లా లీగల్ హై సీజన్ 2 (Maamla Legal Hai Season 2). ఏప్రిల్ 3, 2026న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదల కానుంది. పాట్‌పర్‌గంజ్ జిల్లా కోర్టు నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామాలో, విడి. త్యాగి (రవి కిషన్) జడ్జిగా పాత్రను పోషిస్తూ మరింత హాస్యాన్ని, ఎమోషన్స్‌ను తీసుకురానున్నాడు. రాహుల్ పాండే తెరకెక్కించిన ఈ సిరీస్ కోర్టులోని విచిత్రమైన కేసులను, లాయర్ల సరదా కష్టాలను చూపించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News