Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిద్రమత్తులో డ్రైవర్..  ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

నిద్రమత్తులో డ్రైవర్.. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

V6 Velugu 5 days ago

తిమ్మాపూర్, వెలుగు: డ్రైవర్​నిద్రమత్తులోకి జారుకోగా.. లారీ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన కరీంనగర్ లోని అలుగునూర్​లో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..

హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు వస్తున్న లారీ డ్రైవర్​ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో రాజీవ్ రహదారిపైనున్న రెయిలింగ్​ను ఢీకొట్టి అదే వేగంతో రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగగా స్థానికులు ఆర్పివేశారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. సుమారు రూ.8 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు జాప మధుసూదన్ రెడ్డి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News