Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం... కుక్కల అరుపుతో పరార్..

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం... కుక్కల అరుపుతో పరార్..

V6 Velugu 1 week ago

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి రహదారి సమీపంలోని రోడ్డు ప్రక్కన ఓ పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర చిరుత సంచరించింది.

అయితే.. అదే సమయంలో కుక్కలు అరవడంతో వెనుదిరిగింది చిరుత. చిరుత సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయ కూలీలు, రైతులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత సంచారానికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు.

ఒంటరిగా పొలాల వైపు ఎవరు వెళ్ళొద్దని సూచిస్తున్నారు అధికారులు. పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు అనుమానం వచ్చినా కూడా తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News