Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిజామాబాద్‌: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని.. భర్త, అత్తపై విష ప్రయోగం

నిజామాబాద్‌: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని.. భర్త, అత్తపై విష ప్రయోగం

V6 Velugu 2 weeks ago
  • మీల్‌మేకర్‌ కర్రీలో గడ్డి మందు కలిపిపెట్టిన భార్య

నిజామాబాద్‌, వెలుగు: వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డురాకుండా ఉండేందుకు భార్య విషప్రయోగం చేయగా వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

నిజామాబాద్​జిల్లా మోపాల్‌ మండలం ముదక్‌పల్లిలో జరిగిన ఘటన వివరాలను ఎస్సై సుస్మిత వెల్లడించారు. గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్న అలియాస్‌ భూమయ్యతో సోనీ(33)తో 15 ఏండ్ల క్రితం పెండ్లి జరిగింది. అయితే సోనీ మరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ విషయంపై వారి ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. పద్ధతి మార్చుకోమని భర్తతోపాటు అత్త భూదెవ్వ అనేకసార్లు మందలించారు.

దీంతో భర్తతోపాటు అత్తను చంపి వారి అడ్డు తొలగించుకోవాలని సోనీ ప్లాన్​వేసింది. సోమవారం ఇంట్లో వండిన మీల్‌ మేకర్‌ కర్రీలో గడ్డి మందు కలిపింది. మొదట ఆ కూరతో అన్నం తిన్న అత్త భూదెవ్వకు తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. కూర వాసన తేడాగా అనిపించి అనుమానంతో భర్త భూమయ్య మధ్యలోనే భోజనం ఆపేశాడు. అప్పటికే స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఇద్దరూ జీజీహెచ్‌ హాస్పిటల్‌ల్లో చేరగా డాక్టర్ల ట్రీట్‌మెంట్‌తో ప్రాణాపాయం తప్పింది. నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News