Dailyhunt
నిరుద్యోగ యువతకు జాబ్స్ కోసం ఇవాళ(ఏప్రిల్ 8) జర్మనీతో ఎంవోయూ

నిరుద్యోగ యువతకు జాబ్స్ కోసం ఇవాళ(ఏప్రిల్ 8) జర్మనీతో ఎంవోయూ

V6 Velugu 5 days ago
  • అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిరుద్యోగులను తీర్చిదిద్దుతం: మంత్రి వివేక్‌ వెంకటస్వామి
  • టామ్ కామ్ ద్వారా కొత్త స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇస్తున్నామని వెల్లడి
  • హనోవర్​లో ఫెడరల్​ ఎంప్లాయిమెంట్​ ఏజెన్సీ అధికారులతో భేటీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నిరుద్యోగ యువత కు జర్మనీలో ఉద్యోగాలు కల్పించే అంశంపై కీలక అడుగు పడనున్నది. బుధవారం జర్మనీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనున్నది. ఇందులో భాగంగా మంగళవారం జర్మనీలోని హానో వర్ నగరంలో జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి, స్పెషల్ సీఎస్ దానకిశోర్, టామ్ కామ్ జీఎం నాగభారతి భేటీ అయ్యారు. రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. తెలంగాణ నుంచి జర్మనీకి స్కిల్డ్ నిరుద్యోగులను పంపే అంశంపై ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. జర్మనీలో స్కిల్డ్ యువత తక్కువ ఉన్న రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించాలని నిర్ణ యించారు. జర్మన్ ఉద్యోగ మార్కెట్ అవసరాలను
తీర్చేందుకు తెలంగాణ సన్నద్ధత, నైపుణ్య ప్రమాణాలు, లాంగ్వేజ్ ట్రైనింగ్ , సర్టిఫికేషన్ ప్రక్రియలపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి రివ్యూ చేశారు.
గ్లోబల్‌ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ట్రైనింగ్..

తెలంగాణ ప్రభుత్వం యువతను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు పలు కార్య క్రమాలు చేపడుతున్నదని మంత్రి వివేక్ వెల్లడించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్ కంపెనీ (టామ్ కామ్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కొత్త స్కిల్స్ నేర్పిస్తున్నట్టు చెప్పారు. గ్లోబ ల్ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అభివృద్ధి చెందిన పెద్ద దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి అని టామ్‌కామ్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ అగ్రిమెంట్‌ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ యువతకు జర్మనీలో పెద్ద ఎత్తున భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్‌ ఏజెన్సీలో ఎర్లీ కెరీర్ కౌన్సెలింగ్ విభాగం హెచ్‌వోడీ లారా బ్రైట్సామీటర్‌ను మంత్రి, ప్రతినిధి బృందం ఘనంగా సన్మానించింది. ఈ సమావేశంలో మేనేజ ర్ అనిల్‌ కుమార్, పీఎంయూ హెడ్ శ్రీనివాస్ రావు, స్కిల్ టాలెంట్ అక్విజిషన్ హెడ్ బాలా రమణి, సరోజ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News