Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Oh Sukumari OTT Release: మూడు వారాల్లోనే ఓటీటీలోకి 'ఓ సుకుమారి'.. -ఐశ్వర్య రాజేశ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Oh Sukumari OTT Release: మూడు వారాల్లోనే ఓటీటీలోకి 'ఓ సుకుమారి'.. -ఐశ్వర్య రాజేశ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

V6 Velugu 2 weeks ago

టుడు తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన చిత్రం 'ఓ సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీ జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మేకర్స్ ను తీవ్ర నిరాశ పరిచింది. దీంతో సెకండ్ ఛాన్స్ కోసం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్లలోకి వచ్చిన మూడు వారాలకే ఓటీటీ ప్రియులను ఆకట్టుకునేందుకు 'ఓ సుకుమారి' సిద్ధమైంది. ఈ మూవీ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాపడ్డా.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తుంటాయి. దీంతో ఇప్పుడు ఓటీటీ ప్రియులు తప్పక ఆదరిస్తారంటూ ఈ మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కథ విషయానికొస్తే...

యాదగిరి (తిరువీర్) దామిని (ఐశ్వర్య రాజేశ్)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. ఎవరైనా ఆమెను తాకితే వెంటనే షాక్ కొడుతుంది. ఈ కారణంగా గ్రామస్తులంతా ఆమె పెళ్లి త్వరగా చేసి పంపించాలని చూస్తుంటారు. దామినిని పెళ్లి చేసుకున్న తర్వాత యాదగిరి జీవితం ఎలా మారింది? ఆమె సమస్య వెనుక అసలు కారణమేంటి? ఇద్దరి దాంపత్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే సినిమా ప్రధాన కథ.

ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, ఆమని, శ్రీనివాస్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. మహేశ్వర రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇదే వారం 'లెనిన్', 'హృదయం మురళి', 'వంద దేవుళ్లు', 'ఉయిర్', 'మై వాపస్ ఆవుంగా'తో పాటు 'వదంది 2', 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వంటి సిరీస్‌లు కూడా విడుదల కానుండటంతో ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది. మరి ఓటీటీలో ఏ చిత్రం ముందుకు దూసుకుపోతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News