Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటర్ల ఎన్యూమరేషన్‌ గడువు పెంచాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

ఓటర్ల ఎన్యూమరేషన్‌ గడువు పెంచాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ (సర్) ప్రక్రియ గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం, గందరగోళం నెలకొందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు కేవలం 30 శాతం మందికే ఎన్యూమరేషన్ ఫారాలు అందాయని, ఇంకా 70 శాతం మం దికి అందాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో ప్రజలు ఈ ప్రక్రియపై దృష్టి సారించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. ఫారాలు నింపడంపై ప్రజల్లో సరైన అవగాహ న లేకపోవడంతో పాటు అనేక అపోహలు ఉన్నాయని తెలిపారు. ప్రజలందరూ వివరాలు నమోదు చేసుకునేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని, గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News