Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాండిచ్చేరిలో ర్యాపో 23 షూటింగ్: పాటతో పాటు హై-వోల్టేజ్ ఫైట్ సీన్స్

పాండిచ్చేరిలో ర్యాపో 23 షూటింగ్: పాటతో పాటు హై-వోల్టేజ్ ఫైట్ సీన్స్

V6 Velugu 2 weeks ago

రామ్ పోతినేని హీరోగా, దర్శకుడిగా ఓ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నాడు. తన కెరీర్‌లో 23వ చిత్రం కాగా, ర్యాపో 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నారు. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో అందమైన లొకేషన్లలో ఓ విజువల్ ట్రీట్‌లా ఉండే పాటను కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు.

అలాగే 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'కాంతార', 'కరుప్పు' చిత్రాలకు యాక్షన్ కంపోజ్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ డిజైన్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్టు టీమ్ తెలియజేసింది. రామ్‌తోపాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News