Dailyhunt
పదవి నుంచి దిగిపో.. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ ను కోరిన పీట్ హెగ్సెత్‌

పదవి నుంచి దిగిపో.. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ ను కోరిన పీట్ హెగ్సెత్‌

V6 Velugu 2 weeks ago

వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్ తన పదవికి రాజీనామా చేయాలని (ముందస్తు పదవీ విరమణ) కోరినట్లు పెంటగాన్ ధ్రువీకరించింది.

ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న కీలక సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన రాండీ జార్జ్.. గల్ఫ్ వార్, ఇరాక్, అఫ్గనిస్తాన్ యుద్ధాల్లో చురుకైన పాత్ర పోషించారు.

2023 ఆగస్టులో ఆయన ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, జో బిడెన్ హయాంలో మాజీ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు టాప్ మిలిటరీ ఎయిడ్‌గా పనిచేసిన నేపథ్యం..రాండీ జార్జ్ ప్రస్తుత ఉద్వాసనకు ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, హెగ్సెత్‌ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ డజనుకుపైగా అగ్రశ్రేణి జనరల్స్, అడ్మిరల్స్‌ను పదవుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాండీ జార్జ్‌పై వేటు పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News