Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పల్లెల సమగ్ర ప్రణాళికే లక్ష్యం ! టీజీఐఆర్డీలో సర్పంచ్లు, కార్యదర్శుల వర్క్షాప్

పల్లెల సమగ్ర ప్రణాళికే లక్ష్యం ! టీజీఐఆర్డీలో సర్పంచ్లు, కార్యదర్శుల వర్క్షాప్

V6 Velugu 2 weeks ago

'వీబీ-జీ రామ్‌ జీ', 'జీపీ-శాప్'పై ప్రత్యేక చర్చ గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, సాంకేతికత వినియోగంపై దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, క్షేత్రస్థాయి అమలు లక్ష్యంగా రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ)లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు.

'వీబీ-జీ రామ్‌ జీ', 'జీపీ-శాప్' ( గ్రామ పంచాయత్ స్పేషియల్ యాక్షన్ ప్లాన్) అంశాలపై ఈ వర్క్‌షాప్ జరిగింది.

సదస్సు కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన 49 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు హాజరయ్యారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్థానిక వనరుల వినియోగం, జీపీల స్థాయిలో శాస్త్రీయంగా వార్షిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే విషయంపై అధికారులు, నిపుణులు దిశానిర్దేశం చేశారు.

భౌగోళిక సమాచార వ్యవస్థ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించడం, ప్రాధాన్యతా క్రమంలో నిధుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్పెషల్ సీఎస్​దాన కిశోర్, కమిషనర్​దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News