Dailyhunt
పెట్టరా అమరావతి.. పిలవరా కమరావతి.. జగన్ పై ఎంపీ రేణుకా చౌదరి సెటైర్...

పెట్టరా అమరావతి.. పిలవరా కమరావతి.. జగన్ పై ఎంపీ రేణుకా చౌదరి సెటైర్...

V6 Velugu 2 weeks ago

పీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. గురువారం ( ఏప్రిల్ 2 ) నిత్యానందరాయ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రేణుకా చౌదరి.

పెట్టరా పేరు అమరావతి.. పిలవరా కమరావతి అని... గతంలోనే మాజీ సీఎం జగన్ కు చెప్పానని అన్నారు రేణుక చౌదరి. 12ఏళ్ళ తర్వాత ఈ బిల్లు సభకు రావడం బాధాకరమని..పాలసీ పెరలాసిస్ కారణంగా ఏపీ 12 ఏళ్ళు నష్టపోయిందని అన్నారు.

ఇది అమరావతి రైతుల విజయమని..ఎంత వేధించినా రైతుల నిరసన ఆగలేదని అన్నారు.అమరావతికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు రేణుక చౌదరి. విభజన హామీలు 12 ఏళ్ళ పాటు విస్మరించారని..దుగ్గరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్ ను ముగిసిన అధ్యాయం చేశారని అన్నారు.

ALSO READ : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం...

బిల్లు పెట్టడం కాదు.. సమయానికి అమలు చేసి చూపించాలని అన్నారు. ఏపీ తెలంగాణ మధ్య రూ. లక్షా 47 వెల కోట్ల ఆస్తుల పంపకాలు జరగలేదని అన్నారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు ఆడుకుంటోందని అన్నారు.

తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని..రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,NTPCలను కూడా ఇవ్వలేదని అన్నారు రేణుక చౌదరి. రాజకీయ అవసరాల కోసమే ఏపీకి విభజన హామీలు అమలు చేస్తున్నారని.. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News