Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజావాణి అప్లికేషన్లపై నిర్లక్ష్యం చేయవద్దు

ప్రజావాణి అప్లికేషన్లపై నిర్లక్ష్యం చేయవద్దు

V6 Velugu 2 weeks ago

సిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని, సత్వరమే పరిష్కారించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత అన్నారు.

సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్వో వేణు పాల్గొన్నారు.

కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 80 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, గిరి ఫిర్యాదులు స్వీకరించారు.

ఆదిలాబాద్​ టౌన్: ప్రజావాణి పోర్టల్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును పరిశీలించిన నిర్దేశిత గడువులోగా ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని కలెక్టర్​రాజర్షి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 94 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.

కరీంనగర్‌లో 169 దరఖాస్తులు స్వీకరణ

కరీంనగర్ టౌన్: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరష్కరించాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొని 169 దరఖాస్తులను స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీవాకడే, శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవోషర్మిల, వివిధ శాఖల జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

నస్పూర్/జన్నారం రూరల్‌: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండల్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి కుంటను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎఫ్ సీఎస్ ఫిషర్‌ కోపరేటివ్ సొసైటీ ప్రజావాణిలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News