Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత

V6 Velugu 3 weeks ago

హైదరాబాద్: ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

కృష్ణా జిల్లా, కురుమద్దాలి గ్రామంలో నారాయణరావు జన్మించారు. 1976లో వచ్చిన అంతులేని కథ సినిమా ద్వారా నారాయణరావు వెండితెరకు పరిచయం అయ్యారు. పలు సినిమాలలో, పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.

మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నారాయణ రావు శిక్షణ తీసుకున్నారు. రజనీకాంత్, చిరంజీవికి నారాయణరావు మంచి మిత్రులు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు.

దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్ళినీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నారాయణరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News