Dailyhunt
రాబోయే 48 గంటలు ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టొద్దు.. ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన

రాబోయే 48 గంటలు ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టొద్దు.. ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన

V6 Velugu 1 week ago

టెహ్రాన్:టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్లోని భారత పౌరులకు కీలక సూచన చేసింది. వచ్చే 48 గంటల పాటు ఇరాన్లోని భారత పౌరులు ఎక్కడ వాళ్లు అక్కడే ఉండాలని సూచించింది.

ఇళ్లలోనే ఉండాలని భారత పౌరులకు కీలక సూచన చేసింది.

ఇరాన్‌కు ట్రంప్‌ కీలక హెచ్చరిక చేయడంతో ఇరాన్లోని భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రాయబార కార్యాలయం ఈ సూచన చేయడం గమనార్హం. ఇరాన్‌ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని, అది జరగొద్దనే అనుకుంటున్నానని.. కానీ అదే జరిగే అవకాశం ఉందని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం 'ట్రూత్'లో ట్రంప్ పోస్ట్ చేయడంతో కలకలం రేగింది.

ఈ రాత్రికి ఇరాన్లో భారీ విధ్వంసమే జరగొచ్చనే అనుమానాలకు తావిచ్చింది. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం అని ట్రంప్‌ చేసిన పోస్ట్ ఈ అనుమానాలు మరింత బలపడేలా చేసింది. అయితే.. ఇరాన్ కూడా ట్రంప్ బెదిరింపులకు ధీటుగా బదులిచ్చింది. ట్రంప్‌ హెచ్చరిక చేసిన క్రమంలో.. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టింది. అమెరికాతో దౌత్యపరమైన చర్చలకు ఇరాన్ ముగింపు పలికింది.

అమెరికా వైఖరి ఇలానే కొనసాగితే.. బాబ్‌ ఎల్‌ మండేబ్‌ జలసంధిని కూడా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. హార్మూజ్‌ జల సంధిని స్తంభింపజేసినట్టుగానే బాబ్‌ ఎల్‌ మండేబ్‌ జలసంధిని కూడా మూసివేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికతో యుద్ధం కీలక మలుపు తిరిగింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కువైట్పై 17 డ్రోన్ అటాక్స్ జరిగాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News