Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామగుండం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ

రామగుండం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటాపోటీ

V6 Velugu 3 weeks ago

గోదావరిఖని, వెలుగు: ఖాళీగా ఉన్న రామగుండం కార్పొరేషన్​ఏరియా కాంగ్రెస్​అధ్యక్ష పదవికి పోటాపోటీ నెలకొంది. బుధవారం ఏఐసీసీ మెంబర్​, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అబ్జర్వర్​ దీపక్​రాథోడ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్‌ ఫహీమ్​గోదావరిఖనిలో పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష పదవి కోసం ఆశావహుల నుంచి నామినేషన్​ పత్రాలు స్వీకరించారు.

కాగా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష పదవి కోసం సీనియర్​ లీడర్లు, పలువురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్‌గా కొనసాగిన పాతపెల్లి రవికుమార్​, కార్పొరేటర్లు ఎండీ ముస్తాఫా, నెలకంటి రాము, సీనియర్​ లీడర్లు కాల్వ లింగస్వామి, పెద్దెల్లి ప్రకాశ్​, తిప్పారపు శ్రీనివాస్​ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News