Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయికల్: చనిపోతున్నానని ఇంటికి ఫోన్..కాపాడిన పోలీసులు

రాయికల్: చనిపోతున్నానని ఇంటికి ఫోన్..కాపాడిన పోలీసులు

V6 Velugu 1 week ago

రాయికల్, వెలుగు: చావుబతుకుల్లో ఉన్న ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. జగిత్యాల జిల్లా రాయికల్​కు చెందిన బోడి నాగరాజు సోమవారం పురుగు మందు తాగి తాను చనిపోతున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.

వారు వెంటనే డయల్​100కు ఫోన్​ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన బ్లూకోల్ట్స్​కానిస్టేబుల్​ సుమన్​ జీపీఎస్​ ద్వారా నాగరాజు మూటపల్లి శివారులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి పురుగు మందు తాగి పడి ఉన్న నాగరాజును హాస్పిటల్​కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News