రంగారెడ్డి: జిల్లాలోని షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ట్రెఫాయిల్ (Trefoil) కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.
ఈ ఘటనతో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
కంపెనీలో అగ్నిప్రమాదం జరగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

