Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RashmikaVijay: నా యాసలో తప్పేంటి? ట్రోలర్లకు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్‌!

RashmikaVijay: నా యాసలో తప్పేంటి? ట్రోలర్లకు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్‌!

V6 Velugu 10 hrs ago

సినిమా ఏదైనా.. భాష ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న.

అయితే, కెరీర్‌ ఆరంభం నుంచి తనను ఏదో ఒక విషయంలో ట్రోల్‌ చేస్తూనే ఉన్నారని ఈ బ్యూటీ వెల్లడించింది. ముఖ్యంగా హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతున్నానంటూ వస్తున్న విమర్శలపై గట్టిగానే స్పందించింది. తన సహజమైన యాసను తప్పుగా చూడటంలో అర్థం లేదంటూ ట్రోలర్లకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

నేను దక్షిణాది నుంచే వచ్చా..

లేటెస్ట్ గా 'కాఫీ విత్‌ కరణ్‌' సీజన్‌ 9లో విజయ్‌ దేవరకొండతో కలిసి పాల్గొన్న రష్మిక.. తన కెరీర్‌, భాష, నటనపై ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్టోబర్‌ 21న ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో ఈ జంట పంచుకున్న విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి రష్మిక మాట్లాడుతూ.. "నేను దక్షిణాది నుంచే వచ్చాను. కాబట్టి నా మాటల్లో ఆ యాస ఉండటం సహజం. అలా కాకుండా మరోలా ఉండాలని ఆశించడం సమంజసం కాదు" అని స్పష్టం చేసింది.

కెరీర్‌ మొదలైనప్పటి నుంచి తన నటన, భాష, డైలాగులు చెప్పే విధానం.. ఇలా ఎన్నో అంశాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయని చెప్పింది. అయితే, వాటిని చూసి తనకు తాను పరిమితులు విధించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. ఒక్క పరిశ్రమకో, ఒక్క భాషకో పరిమితం కాకుండా విభిన్న కథల్లో నటించాలన్నదే తన లక్ష్యమని వివరించింది.

డబ్బింగ్‌లోనూ తగ్గేదేలే..

వేర్వేరు భాషల్లో నటించడం ఎంత సవాలో, ఆయా భాషల్లో తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పడం కూడా అంతే కష్టమని రష్మిక పేర్కొంది. తనకు బదులుగా మరో డబ్బింగ్‌ ఆర్టిస్టును ఎంచుకునే స్వేచ్ఛను దర్శకులకు ఇస్తానని, అయినప్పటికీ ఇప్పటివరకు తనతోనే డబ్బింగ్‌ చెప్పించేందుకు వారు ఆసక్తి చూపారని వెల్లడించింది. అన్ని భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్‌ చెప్పగలగడం తనకు గర్వకారణమని చెప్పింది.

'యానిమల్‌', 'ఛావా', 'తమ్మా' వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకులకూ చేరువైన రష్మిక.. వైవిధ్యమైన పాత్రల్లో నటించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి 'రణబాలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొత్తానికి, తన యాసను మార్చుకోవడం కంటే తన ప్రతిభతోనే సమాధానం చెప్పాలన్న రష్మిక వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News