Dailyhunt
సర్ ప్రక్రియలో ఎంఐఎం అక్రమాలు..సీఈవో సుదర్శన్ రెడ్డికి బీజేపీ ఫిర్యాదు

సర్ ప్రక్రియలో ఎంఐఎం అక్రమాలు..సీఈవో సుదర్శన్ రెడ్డికి బీజేపీ ఫిర్యాదు

V6 Velugu 2 weeks ago
  • హిందువుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ

ఓల్డ్​సిటీ, వెలుగు: ఓల్డ్​సిటీలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎంఐఎం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు.

భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎంఐఎం కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ 2002 ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటు ఉంటుందని ప్రజలను భయపెడుతున్నారని, హిందూ ఓటర్ల వివరాలు సేకరించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఓల్డ్​సిటీలోని ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆన్​లైన్​లో తప్పుడు సమాచారం ఇస్తూ ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని, అధికారులు కావాల్సిన వివరాలను నేరుగా జీహెచ్‌ఎంసీ ద్వారా తెప్పించుకోవాలని కోరారు. సీఈవోను కలిసిన వారిలో మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, చింతల రామచంద్రారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, నిరంజన్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు శ్రీనాథ్, శ్రీకాంత్ రెడ్డి, పూనా వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News