Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సర్‌'లో ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

'సర్‌'లో ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

V6 Velugu 2 weeks ago

టేకులపల్లి, వెలుగు: 'సర్' ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు అన్నారు.

గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, చేర్పులు, తొలగింపులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమావేశమై గ్రామాల వారీగా కార్యక్రమ పురోగతిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు కోరం సురేందర్, లక్కినేని శ్యామ్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, సర్పంచులు సువర్ణ, కళ్యాణ్, స్వరూప, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News