Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏల ముందు ఆదివాసీ మార్చ్

సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏల ముందు ఆదివాసీ మార్చ్

V6 Velugu 4 days ago

వెంకటాపురం, వెలుగు: ఆదివాసీల హక్కులు, ఉద్యోగాలు, భూములు, చట్టాల అమలు కోసం ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐటీడీఏ హెడ్ క్వార్టర్లలో ఆదివాసీ మార్చ్‌ నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ తెలిపారు.

సోమవారం ములుగు జిల్లా వెంకటాపురంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ మార్చ్ పోస్టర్‌, కరపత్రాలను రిలీజ్​ చేశారు. ముందుగా కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

5వ షెడ్యూల్ ప్రాంతాల్లో 29 శాఖల ఉద్యోగాలను ఐటీడీఏల ద్వారా భర్తీ చేయాలని, పోడు భూములకు పట్టాలు, గిరి వికాస్ బోర్లు, సాగునీరు ఇవ్వాలని, సింగరేణి, పరిశ్రమల్లో ఆదివాసీలకు ఉద్యోగాలు, వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7న ఏటూరునాగారం, 16న ఉట్నూర్, 21న భద్రాచలం, 28న మన్ననూరులో మార్చ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News