Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెప్టెంబర్14వ తేదీనే వినాయక చవితి.. విగ్రహ పూజ ముహూర్త సమయం ఇదే..!

సెప్టెంబర్14వ తేదీనే వినాయక చవితి.. విగ్రహ పూజ ముహూర్త సమయం ఇదే..!

V6 Velugu 3 hrs ago

ఏడాది ( 2026) సెప్టెంబర్​ 11తో శ్రావణమాసం ముగియనుంది. ఆతరువాత తెలుగు నెలలో ఆరవ మాసం బాధ్రపద మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో సర్వ విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడు ఆవిర్భవించాడు.

ఈ ఏడాది వినాయకచవితి పండుగ ఏ రోజు వచ్చింది.. ఏసమయంలో విగ్రహానికి పూజలు చేయాలి.. శుభ ముహూర్తం ఎప్పుడు..చవితి తిథి ఎప్పుడు వచ్చింది.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

గణపయ్య కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు..ఘనమైన భగవంతుడు. చిన్నా పెద్దా అందరూ మెచ్చే దైవం. ఈ సష్టి మొత్తం ఎన్నో గణాలతో కూడి ఉంటుంది..ఆ గణాలను శాసించే మహా శక్తిమంతుడు లంబోదరుడు. అందుకే ఏది ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ ఎలాంటి గణాలు అడ్డుతగలకూడదని భావించి..గణపతిని పూజిస్తారు.

హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా పూజించేది ప్రథమ పూజ్యుడైన విఘ్నేశ్వరుడినే. భాద్రపద మాస శుక్ల పక్ష చవితి తిథి నాడు గణేశుని జన్మదినాన్ని దేశవ్యాప్తంగా వినాయక చవితి పర్వదినంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజుసెప్టెంబర్ 14న వచ్చింది.

బాధ్రపదమాసం శుక్ల పక్షం చవితి ( వినాయక చవితి) వివరాలు

  • భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి ప్రారంభం : సెప్టెంబర్​14 ఉదయం 5:22 గంటలకు
  • భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి ముగింపు: సెప్టెంబర్​15 ఉదయం 7:14 గంటలకు

పండితులు తెలిపిన ప్రకారం, వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 14న రోజున వినాయక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి.

పురాణాల ప్రకారం వినాయకుడి మధ్యాహ్నసమయంలో జన్మించాడు.

గణపతి పూజకు శుభ ముహూర్తం: సెప్టెంబర్ 14 ఉదయం 11:05 గంటల నుంచి మధ్యాహ్నం 01:35 గంటల వరకు

పురాణాల ప్రకారం బాధ్రపదమాసం శుక్ల పక్షం చతుర్థి (సెప్టెంబర్​ 14) రోజున వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగించి.. అదృష్టం.. శ్రేయస్సు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు. తొమ్మిది రాత్రుళ్లు ... ప్రతిరోజూ పూజలు చేస్తారు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన మండపంలో భక్తులు భజనలు చేస్తూ ఆడిపాడతారు. వినాయకుడిని నిష్టగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం. ఎందుకంటే ఈ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుకు సాగుతుందని నమ్మకం. అలాగే ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని పండితులు చెబుతారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News