Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీకృష్ణాష్టమి :  కన్నయ్య పుట్టిన రోజున పెట్టాల్సిన వెన్న ప్రసాదాలు.. ఎలా తయారు చేయాలంటే

శ్రీకృష్ణాష్టమి : కన్నయ్య పుట్టిన రోజున పెట్టాల్సిన వెన్న ప్రసాదాలు.. ఎలా తయారు చేయాలంటే

V6 Velugu 1 week ago

కాస్త వెన్న చాలు కన్నయ్యకి. దానికోసం చిన్ని కృష్ణుడి చేసిన సాహసాలు.. యశోదమ్మతో తిన్న చివాట్లు అందరికీ తెలిసినవే. గోపికలు ఎంత కట్టడి చేసినా నిమిషాల్లో వెన్న కుండఖాళీ చేసేవాడు కన్నయ్య.మరి కృష్ణుడికి అంత ఇష్టమైన వెన్నతో తయారు చేసిన పదార్ధాలను ఆయన పుట్టినరోజునాడు ప్రసాదంగా...

పెట్టకపోతే ఎలా? మరి సెప్టెంబర్​ 4న మన ఇంట్లోని చిన్ని కృష్ణుళ్లకి, గోపికమ్మలకి నోరూరించే ఈ వెన్న వంటలు వండి పెట్టేద్దాం. మరి అలాంటి వంటలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .!

వెన్న ముద్దలు తయారీకి కావలసినవి

  • బియ్యప్పిండి- అర కప్పు
  • మినప్పిండి- పావుకప్పు
  • పచ్చి కొబ్బరి తరుము- పావు కప్పు
  • ఇంగువ- చిటికెడు

తయారీ విధానం : ఒకగిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి,పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, ఇంగువ వెన్న వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్నచిన్న ఉండలుగా చేయాలి. అంతే వెన్నముద్దలు రెడీ.

వెన్న ఉండలు తయారీకి కావాల్సినవి

  • చక్కెర- రెండు కప్పులు
  • బియ్యప్పిండి- పావు కప్పు
  • నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
  • వంటసోడా - చిటికెడు

తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, బియ్యప్పిండి, వెన్న, వంటసోడా వేసి గోరువెచ్చని నీళ్లుపోసి పిండి ముద్దలా చేయాలి. దానిపైన తడి బట్టవేసి గంటసేపు పక్కన పెట్టాలి. ఆ తరువాత చిన్న చిన్న ఉండలు చేసి వాటిమీద కూడా ఐదు నిమిషాల పాటు తడిబట్ట ఉంచాలి.

ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి వెన్న ఉండల్ని సన్నటి మంట మీద లేత గోధుమరంగు వచ్చేవరకు వేగించాలి. వేగిన ఉండల్ని కాసేపు చల్లారనివ్వాలి. ఈ లోపు చక్కెరలో తగినన్ని నీళ్లు పోసి తీగపాకం రెడీ చేయాలి. వేగించిన వెన్న ఉండల్ని ఆ చక్కెర పాకంలో వేసి గరిటెతో కొద్ది సేపటి వరకు ఆపకుండా కలపాలి. అంతే వెన్న ఉండలు రడీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News